అయోధ్య గుడిలో 200 కోట్ల చోరీ- సర్కారే కూలిపోతుందన్న కేజ్రివాల్..!

అయోధ్య రామాలయంలో కోట్ల రూపాయల విరాళాలు గోల్ మాల్ అయ్యాయన్న ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా భక్తుల్ని తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. యూపీలో సమాజ్ వాదీ పార్టీ నేత ఒకరు లేవనెత్తిన ఈ విషయం ఇప్పుడు భక్తులతో పాటు రాజకీయ వర్గాలనూ కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ (Aravind Kejriwal) సైతం ఈ వ్యవహారంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. చిన్న చిన్న నేరాలకే రంగంలోకి దిగే సీబీఐ, ఈడీలు ఏం చేస్తున్నాయని కేజ్రివాల్ ప్రశ్నించారు.

అయోధ్య రామమందిర విరాళాల దొంగతనం ఆరోపణల కేసులో పెద్ద పెద్ద వారి ప్రమేయం ఉందని, వారి పేర్లు బయటపడితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని కేజ్రివాల్ పేర్కొన్నారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక రామమందిరమని, అలాంటి గుడి నుండే కోట్ల రూపాయల విలువైన విరాళాలు చోరీకి గురయ్యాయని, అయినా ఇప్పటివరకు ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదన్నారు. ప్రభుత్వం ఎవరిని కాపాడుతోంది? ఈ పాపంలో ఎంతటి పెద్ద వ్యక్తులు ప్రమేయం కలిగి ఉన్నా సరే, వారిని నేరుగా జైలుకు పంపాలి. కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని కాపాడటం అత్యంత అవసరమని ట్వీట్ చేశారు.

No FIR No Arrest Kejriwal Slams CBI ED Over Ram Temple Donation Theft to Visit Ayodhya

రామమందిరానికి సమర్పించిన నగదు, విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని కేజ్రివాల్ ఆరోపిచారు. అయినా దర్యాప్తు సంస్థలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అయోధ్య రామమందిరం నుండి కోట్ల రూపాయల విరాళాలు చోరీకి గురయ్యాయి. సుమారు 200 కోట్ల రూపాయల నగదు చోరీ జరిగిందని అంటున్నారని, అలాగే వజ్రాలు, ఆభరణాలతో కూడిన అనేక పెట్టెలు కూడా అపహరణకు గురయ్యాయని, అయినా ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదన్నారు. యూపీ పోలీసులు గానీ, ఈడీ గానీ, సీబీఐ గానీ ఎవరూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదన్నారు.

No FIR No Arrest Kejriwal Slams CBI ED Over Ram Temple Donation Theft to Visit Ayodhya

కేంద్రంలోనూ, యూపీలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని, అయినా ఎటువంటి దాడులు లేవు, అరెస్టులు లేవన్నారు. ఇందులో చాలా పెద్ద పేర్లు ప్రమేయం ఉన్నాయని అంటున్నారని, చర్యలు తీసుకుంటే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. మీ దృష్టిలో దేనిని కాపాడుకోవడం ముఖ్యం? ప్రభుత్వమా లేక కోట్ల మంది ప్రజల విశ్వాసమా అని ప్రశ్నించారు. శుక్రవారం నాడు శ్రీరామ మందిరాన్ని సందర్శించి దర్శనం చేసుకోబోతున్నానని కేజ్రివాల్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+