ఏకంగా 20% డీఏ హైక్ ఇచ్చిన సువేందు: లక్ష ఉద్యోగాలు

పశ్చిమ బెంగాల్ లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి సువేందు అధికారి సారథ్యంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా కొద్దిసేపటి కిందటే బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ఉపాధి కల్పన, సంక్షేమం, భద్రత, పారిశ్రామిక వృద్ధిని సమపాళ్లలో మిళితం చేసినట్టు కనిపించింది. వికసిత్ బంగ్లాను నిర్మించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

రూ. 8.15 లక్షల కోట్ల అప్పు..

గత ప్రభుత్వంలో రూ. 8.15 లక్షల కోట్ల అప్పులు ఉన్నట్లు మంత్రి ప్రస్తావించారు. ఆర్థికంగా ఇటువంటి భారీ సవాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజానీకంపై ఎటువంటి అదనపు పన్నుల భారాన్ని మోపకుండా ఆదాయ వనరులను పెంచుకోవడమే తమ ప్రధాన వ్యూహమని పేర్కొన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ యథాతథంగా కొనసాగిస్తామని, దాంతో పాటు కొత్త ప్రాజెక్టులతో నూతన ప్రగతి వైపు పరుగు తీయిస్తామని వెల్లడించారు.

West Bengal Budget Promises Viksit Bangla DA for state govt employees will be Hiked by 20 percent

లక్ష ఉద్యోగాల భర్తీ..

బడ్జెట్‌లో ఉపాధి రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పించారు. అనేక ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న సుమారు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంట్లో 33 శాతం ఉద్యోగాలను మహిళలకే కేటాయించనున్నారు. దీంతో పాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 50,000 ఉపాధ్యాయ పోస్టులు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మరో 20,000 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు.

డీఏ 20 శాతం మేర పెంపు..

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చేలా డీఏను ఏకంగా 20 శాతం మేర పెంచుతున్నట్లు స్వపన్ దాస్ గుప్తా ప్రకటించారు. ఈ తాజా పెంపుతో ఉద్యోగుల మొత్తం డీఏ అర్హత 38 శాతానికి చేరుకోనుంది. పెరిగిన జీతాల భత్యాలు ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తాయి. మరోవైపు నిరుపేద కుటుంబాలకు సత్వర సేవలు అందించే గ్రామీణ పోలీస్ సిబ్బంది, సివిక్ వాలంటీర్లు, హోంగార్డులు, గ్రీన్ పోలీస్ సిబ్బందికి ఇచ్చే నెలవారీ వేతనాన్ని కూడా రూ. 2,000 చొప్పున పెంచినట్లు తెలిపారు.

తమిళనాడులో క్యుములోనింబస్ బీభత్సం: నామరూపాల్లేని టోల్ గేట్
తమిళనాడులో క్యుములోనింబస్ బీభత్సం: నామరూపాల్లేని టోల్ గేట్

మహిళా సాధికారతకు భరోసా

ఈ బడ్జెట్‌లో మహిళల భద్రత, సంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళల కోసం ఉద్దేశించిన అన్నపూర్ణ యోజన కార్యక్రమానికి బడ్జెట్‌లో అత్యధికంగా రూ. 36,000 కోట్లను కేటాయించారు. అదే విధంగా ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రోత్సహించేందుకు ఏకమొత్తంగా రూ. 50,000 ఆర్థిక సాయం అందించే వినూత్న పథకాన్ని తీసుకువచ్చారు. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినులను మెరుగైన విద్య సౌకర్యం కల్పించడం దీని ఉద్దేశం.

పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా హెల్ప్ డెస్క్..

మహిళా రక్షణను బలోపేతం చేసే క్రమంలో రాష్ట్రంలోని ప్రతి సబ్ డివిజన్‌లో ప్రత్యేకంగా ఒక విమెన్ పోలీస్ స్టేషన్‌ను నిర్మించడానికి ప్రతిపాదించారు. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళల హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయడం, బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాలలో ప్రత్యేకంగా గస్తీ తిరిగేలా మహిళా డిపార్ట్‌మెంట్ సిబ్బందితో కూడిన దుర్గా సురక్ష స్క్వాడ్స్ ను రంగంలోకి దించనున్నారు.

నూతన పోర్టులు, విమానాశ్రయాలు..

రవాణా అనుసంధానం మెరుగుపరచడానికి, పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం చేయడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో అత్యున్నత ప్రాధాన్యత లభించింది. కోల్‌కతాలో రద్దీని తగ్గించేలా కల్యాణి సమీపంలో రాష్ట్రంలో రెండవ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టును ప్రతిపాదించారు. దీనితో పాటు పురూలియా, మాల్దా, బాలుర్‌ఘాట్ వంటి ప్రాంతాలలో కూడా నూతన విమానాశ్రయ నిర్మాణాలకు రూపకల్పన చేశారు. ఈస్ట్ మేదినీపూర్‌లో భారీ డీప్ సీ పోర్ట్ అభివృద్ధి కోసం కూడా ప్రణాళికను రూపొందించారు.

ఏఐ విద్యా విధానం..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ప్రోత్సహించడంలో భాగంగా 'బెంగాల్ ఏఐ మిషన్'ను ప్రకటించారు. దీనికింద 500 కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రిటైర్డ్ జర్నలిస్టులకు నెలకు రూ. 5,000ల ప్రత్యేక పించను పథకాన్ని ప్రవేశపెట్టారు. రాజకీయ వైషమ్యాలతో తప్పుడు కేసులకు బలైన వారిని ఆదుకోవడానికి నెలకు రూ. 10,000 అందించే సంగ్రామి భత్య పథకాన్ని ప్రతిపాదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+