నల్లమల అడవుల్లో ఎన్‌కౌంటర్: డంప్ స్వాధీనం
ఒంగోలు: ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం చిన్నారుట్ల గ్రామ సమీపంలోని నల్లమల అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ను పోలీసులు ధృవీకరించడం లేదు. నల్లమల అడవుల్లో భారీ ఎత్తున మావోయిస్టుల డంప్ పోలీసుల చేతికి చిక్కినట్లు సమాచారం.
గ్రేహౌండ్స్ దళాలు నల్లమల అడవుల్లో గత కొద్ది రోజులుగా గాలింపు జరుపుతున్నారు. వారికి పెద్ద యెత్తున మావోయిస్టుల ఆయుధాలు, మందుపాతర సామ6గి లభ్యమవుతున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
