రవి హత్యతో నాకు సంబంధం లేదు: అజీజ్ రెడ్డి
హైదరాబాద్: అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ్యుడు పరిటాల రవి హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని మాఫియా లీడర్ అజీజ్ రెడ్డి స్పష్టం చేశాడు. పరిటాల రవి హత్యకు అజీజ్ రెడ్డి ఆయుధాలు సరఫరా చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను ఆయుధాలు సరఫరా చేయలేదని, రవి హత్యతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని అతను గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పాడు.
తనను ప్రశ్నిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అన్ని విషయాలు చెప్తానని అతను అన్నాడు. జైలులో ఉన్న తాను ఎలా ఆయుధాలు సమకూర్చగలనని అజీజ్ రెడ్డి అడిగాడు. డబ్బులుంటే చర్లపల్లి జైలులో ఏ పనైనా జరుగుతుందని అతను అన్నాడు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి చర్లపల్లి జైలులో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండడం తాను చూశానని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications
