నాది టిడిపి, మా నేత చంద్రబాబు: తుమ్మల
ఖమ్మం: తమ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇంతటితో ఈ వివాదాన్ని వదిలేయాలని ఆయన మీడియాకు విజ్ఞప్తి చేశారు.
"నా పార్టీ తెలుగుదేశం, మా నాయకుడు చంద్రబాబునాయుడు అని ఆయన అన్నారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా తాను తెలుగుదేశం పార్టీలోనే చంద్రబాబునాయుడి వెంటే ఉంటానని ఆయన అన్నారు. దెబ్బలాడి చంద్రబాబునాయుడితో పనులు చేయించుకునే శక్తి, సామర్థ్యం, అనుబంధం తనకు ఉన్నాయని, అందువల్ల వేరే రకంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
