రాజ్యసభ సీటుకు రాజీనామాకు కరుణాకరన్ నిర్ణయం
తిరువనంతపురం: సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె. కరుణాకరన్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీని పెట్టాలనే కృత నిశ్చయంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తాను నిర్ణయం తీసుకున్నానని, ఇక అందుకు అవసరమైన వాటిని అమలు చేయాల్సి ఉందని ఆయన ఆసియా నెట్ ఛానెల్‌తో అన్నారు.
పార్టీ అభ్యర్థిగా గెలిచిన సీటులో కొనసాగడం కష్టమైనప్పుడు రాజీనామా చేయడమే సరైందనేది తన ఆలోచన ఆయన అన్నారు. త్రిషూర్‌లో మే 1వ తేదీన తలపెట్టిన సదస్సుకు ముందా, వెనకనా అనేది ముఖ్యం కాదని, రాజీనామాకు అవసరమైన విధానాలను పాటించడమే ఉన్నదని ఆయన అన్నారు. కరుణాకరన్ నిరుడు ఏప్రిల్‌లో రాజ్యసభకు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications
