టిఆర్‌యస్‌పై కాకా మాటలు నిజం: ఎమ్మెస్సార్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నేతలు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్రలపై తమ లోక్‌సభ సభ్యుడు జి. వెంకటస్వామి చేసిన విమర్శలో నిజం ఉన్నదని దేవాదాయ శాఖ మంత్రి ఎం. సత్యనారాయణ అన్నారు. నిజం లేకుంటే వెంకటస్వామి మాట్లాడరని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. టి ఆర్‌యస్ వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందనే హెచ్చరిక వెంకటస్వామి ప్రకటన అని ఆయన అన్నారు.
వెంకటస్వామి తన కన్నా పెద్దవాడని, తన కన్నా సీనియర్ అని, ఎన్నో విషయాలపై అవగాహన ఉంటే తప్ప ఇన్నాళ్లు ఆ స్థాయిలో కొనసాగలేడని ఆయన అన్నారు. పైన జరుగుతున్న విషయాలు తెలుసు కాబట్టే వెంకటస్వామి టి ఆర్‌యస్‌పై మాట్లాడి వుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తన వద్ద అన్ని విషయాలు ఉంటేనే తప్ప నోరు విప్పని సీనియర్ నేత వెంకటస్వామి అని ఆయన అన్నారు. ఏమీ లేకుంటే వెంకస్వామి ఏమీ మాట్లాడరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
