కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలం: విహెచ్
హైదరాబాద్: కాంగ్రెస్ తెలంగాణకు వ్యతిరేకం కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు చెప్పారు. తెలంగాణపై మాట్లాడదలుచుకుంటే తమ సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామిని ఎవరూ అడ్డుకోలేరని, భారతీయ జనతా పార్టీ అనవసరమైన రాద్దాంతం చేస్తోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై బిజెపి ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని అనుకుంటే బిజెపి ముందుకు రావాలని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలమని బిజెపి అంటోందని, గతంలో మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేశామని చెబుకుంటోందని, అటువంటప్పుడు తెలంగాణ కోసం నిర్దిష్టమైన కార్యక్రమంతో బిజెపి ముందుకు రావాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక పథకం పూర్తి కాక ముందే మరో పథకాన్ని ప్రారంభించడంతో గందరగోళం ఏర్పడుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
