వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సామాజిక న్యాయానికి కొత్త పార్టీ: మహారథి
హైదరాబాద్: సామాజిక న్యాయం కోసం రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు సినీ రచయిత త్రిపురనేని మహారథి చెప్పారు. ఏ పార్టీలోనూ సామాజిక న్యాయం అమలు కావడం లేదని, తాము స్థాపించే పార్టీ వినూత్నమైందని ఆయన బుధవారం విలేకరులతో అన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకత్వాలు అగ్రవర్ణాల చేతుల్లోనే ఉన్నాయని ఆయన విమర్శించారు. దళిత, బలహీనవర్గాల చేతుల్లో నాయకత్వం ఉన్నప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
తమ పార్టీలోని అన్ని కమిటీల్లో బలహీనవర్గాలవారికి పెద్ద పీట వేస్తామని, జనాభా నిష్పత్తి ప్రకారం కమిటీల్లో ప్రాతినిధ్యం ఉంటుందని ఆయన చెప్పారు. నారా చంద్రబాబునాయుడు అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణకు తాము అనుకూలమని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!