ఫ్రెంచ్ ఓపెన్: తొలి రౌండ్‌లోనే సానియా ఓటమి
ప్యారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే హైదరాబాద్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఓటమి పాలైంది. సానియా మీర్జా అర్జెంటీనా క్రీడాకారిణి గెసెలా డుల్కోపై 3-6, 3-6 వరుస సెట్లలో పరాజయం పాలైంది. తనకు ఏ మాత్రం పరిచయం లేని క్లే కోర్టులో సానియా తన ప్రత్యర్థిని నిలువరించలేకపోయింది. సర్వీసులను నిలుపుకోవడంలో సానియా విఫలమైంది. అయితే ఒక రకంగా సానియా గట్టిపోటీనే ఇచ్చిందని చెప్పుకోవాలి. ప్రపంచ ర్యాంకింగ్‌లో 30వ స్థానంలో ఉన్న డుల్కోను, అదీ క్లే కోర్టులో ఎదుర్కోవడం కష్టమనే 70వ స్థానంలో ఉన్న సానియా భావించింది. తాను విజయం సాధిస్తానని ఆమె చెప్పలేదు.












Click it and Unblock the Notifications
