మిస్ కెనడాకు విశ్వసుందరి కిరీటం
బ్యాంగాక్: మిస్ కెనడా నటాలి గ్లోబోవా 2005 మిస్ యూనివర్స్‌గా ఎంపికైంది. మిరుమిట్లు గొలిపే పోటీల్లో ఈ ఎంపిక జరిగింది. 23 ఏళ్ల మిస్ కెనడా టొరంటోకు చెందిన మోడల్, మోటివేషనల్ స్పీకర్. ఆస్ట్రేలియాకు చెందిన నిరుటి విశ్వసుందరి జెన్నిఫర్ హాకిన్స్ నుంచి నటాలీ విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది.
నటాలి తల్లిదండ్రులు రష్యా సంతతివారు. వీరు 11 యేళ్ల క్రితం వచ్చి కెనడాలో స్థిరపడ్డారు. తన జీవితాన్ని సాగించడానికి, జీవితంలో విజయం సాధించడానికి అవకాశం ఇచ్చిన కెనడాకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. పూర్టో రికోకు చెందిన సింథియా ఒలవారియా రెండో స్థానంలో నిలిచింది. భారత్‌కు చెందిన అమృతా థాపర్ 15వ స్థానంలో నిలిచింది. జీవితంలో ఎల్లవేళలా తాను సానుకూల దృక్పథంతోనే ముందుకు సాగుతానని నటాలి న్యాయనిర్ణేతలు వేసిన ప్రశ్నకు సమాధనంగా చెప్పింది. విశ్వసుందరి పోటీల వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందగలదని థాయ్‌లాండ్ భావిస్తోంది. సునామితో తీవ్రంగా దెబ్బ తిన్న థాయ్‌లాండ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.












Click it and Unblock the Notifications
