రాజీనామాకు ఎమ్మెస్ సిద్ధం, వైఎస్ వారింపు
హైదరాబాద్: దేవాదాయ శాఖలో అక్రమాలు వెలుగు చూస్తున్న నేపధ్యంలో ఆ శాఖ మంత్రి ఎం.సత్యనారాయణ రావు రాజీనామాకు సిద్ధపడగా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనను వారించారు. ఆ శాఖలో అక్రమాలపై నిజాయితీపరుడైన అధికారితో విచారణ జరిపిస్తామని, మీరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వైఎస్ ఆయనకు నచ్చజెప్పారు. నేడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎం.సత్యనారాయణరావు రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించినట్టు తెలిసింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. తాను చెప్పవలసినది మంత్రివర్గ సమావేశంలో చెప్పానని, రెండు రోజుల వరకు మీడియాతో మాట్లాడేది లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications