ఉరిశిక్షకైనాసిద్ధమే: మంత్రి సత్యనారాయణరావు
కరీంనగర్:తన దేవాదాయ శాఖలో ఏ చిన్న తప్పుజరిగిందని రుజువైనా ఉరిశిక్షకైనా తానుసిద్ధమని ఎం.సత్యనారాయణ రావుఆవేశంగా ప్రకటించారు. శనివారంఇక్కడ జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయనతెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనపైచేసిన ఆరోపణలపైఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ళ క్రితంచంద్రబాబు నాయుడికి మంత్రిపదవి ఇప్పించింది తానేనని ఆయనచెప్పుకున్నారు. తన యాభై ఏళ్ళరాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూపడలేదని ఆయన అన్నారు. రెండు మూడు రోజుల్లో తననిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
