లొంగుబాటుకుగడువు కోరిన పటౌడీ
జజ్జర్: కృష్ణజింకను,రెండు కుందేళ్ళను వేటాడి చంపినకేసులో నిందితులైన భారత క్రికెట్‌మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, అతనిసహచరులు ఆరుగురు మరికొంతగడువుఇప్పించాలని హర్యానా పోలీసులను అభ్యర్థించారు.నోటీసు పంపిన సమయంలో తాము ఇంట్లోలేని కారణంగా జూన్ 15 దాకా తమకుగడువుఇప్పించాలని ఆ తర్వాత లొంగిపోతామనివీరు జజ్జర్ పోలీసుల్ని కోరారు. వన్యమృగాలసంరక్షణ చట్టం కింద వీరు అభియోగాలుఎదుర్కొంటున్నారు. పటౌడీ తదితరులుచేసిన అభ్యర్థన విషయంపై వ్యాఖ్యానించటానికిజజ్జర్ ఎస్. పి నిరాకరించారు. హర్యానా,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో నిందితుల కోసంగాలింపును ముమ్మరం చేసినట్లుతెలిపారు.












Click it and Unblock the Notifications
