టిఆర్‌యస్‌పై భౌతిక దాడులు చేస్తానలేదు: ప్రకాశ్
హైదరాబాద్: కాంగ్రెస్‌తో తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) ఈ నెల 15వ తేదీ లోగా తెగదెంపులు చేసుకోవాల్సిందేనని సిపిఐ (మావోయిస్టు) పోలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ అన్నారు. కాంగ్రెస్‌తో ఈ నెల 15వ తేదీలోగా తెగదెంపులు చేసుకోకపోతే టి ఆర్‌యస్ నేతలను హతమారుస్తామని తాము హెచ్చరించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రకాశ్ పేర ఆదివారం మీడియా కార్యాలయాలకు ఒక ప్రకటన చేరింది. డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని ఆయన అన్నారు. వైయస్ తెలంగాణ వ్యతిరేకి అని ఆయన విమర్శించారు.
ప్రజలకు ద్రోహం చేసే నేతలకు తమ పార్టీ, గెరిల్లా సైన్యం బుద్ధి చెబుతాయని ఆయన అన్నారు. టిఆర్‌యస్ ప్రభుత్వం నుంచి తప్పుకోకపోతే భౌతికదాడులు చేస్తామని తాము అనలేదని ఆయన స్పష్టం చేశారు. నక్సల్స్‌పై హత్యాకాండ కొనసాగిస్తున్న ప్రభుత్వంలో కొనసాగుతున్న టి ఆర్‌యస్ నేతలు గ్రామాలకు వస్తే తరిమికొట్టాలని తాము పిలుపునిచ్చామని ఆయన స్పష్టం చేశారు. సానుభూతిపరులపై, ప్రజాస్వామికవాదులపై, ప్రజాసంఘాల నేతలపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి, హోం మంత్రి కె. జానారెడ్డికి ప్రజాస్వామిక హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
