బడిబాట నిరంతరం: విద్యామంత్రి రాజ్యలక్ష్మి
హైదరాబాద్: బడిబాట కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ప్రాథమిక విద్యామంత్రి ఎన్. రాజ్యలక్ష్మి చెప్పారు. 2008 వరకు రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించనున్నట్లు ఆమె ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. నిబంధలను పాటించని ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
రాష్ట్రంలో గిరిజన పాఠశాలలను పెంచుతామని ఆమె చెప్పారు. గ్రేడింగ్, సిలబస్ కుదింపు, పదవ తరగతి ప్రశ్నపత్రాల కుదింపులలో సంస్కరణలు తెస్తామని ఆమె అన్నారు. పాఠశాలల్లో ఫర్నీచర్ కొనుగోలుకు 15 కోట్ల రూపాయలు ఇస్తామని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
