ఆలయ భూములపై శ్వేతపత్రం: టిడిపి డిమాండ్
హైదరాబాద్: దేవాలయ భూముల విక్రయంపై శ్వేతపత్రం ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. ఆలయ భూముల అక్రమ విక్రయాల్లో పెద్దల ప్రమేయం ఉండడం వల్లనే ప్రభుత్వం సిబి ఐ విచారణకు నిరాకరిస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్. వేణుగోపాలచారి ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దేవాలయ భూమలు అక్రమ విక్రయం వ్యవహారంలో ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆన్నారు.
ఆలయ భూముల విక్రయంపై వస్తున్న ఆరోపణలను కప్పి పుచ్చుకోవడానికి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ఆలయ భూముల విక్రయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయంలో తాము ఏ విచారణకైనా సిద్ధమని ఆయన చెప్పారు.
దేవాలయ భూముల అక్రమ విక్రయం వల్ల ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోందని తెలుగుదేశం నాయకుడు పి. అశోక్ గజపతి రాజు అన్నారు. విశ్వాసం ఉంటేనే విరాళాలు వస్తాయని, ప్రభుత్వ చర్యల వల్ల విశ్వాసం సన్నగిల్లి నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
