తెలంగాణ వచ్చేవరకు నిద్ర పోవద్దు: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ సాధించేవరకు ఎవరూ నిద్ర పోవద్దని సినీనటి విజయశాంతి అన్నారు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) ప్రతినిధుల సభలో ఆమె ఆదివారంనాడు ప్రసంగించారు. తెలంగాణ కోసం సాగుతున్నది ఒక ప్రజా ఉద్యమమని, ఇందులో అందరూ సామాన్య కార్యకర్తలేనని, నాయకులెవరూ లేరని ఆమె అన్నారు.
తెలుగుదేశం, కాంగ్రెస్‌లలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు మాత్రమే అధికారాన్ని అనుభవిస్తున్నాయని ఆమె అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే కొన్ని సామాజిక వర్గాలను ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆమె విమర్శించారు. నక్సలైట్ల వల్ల శాంతి కొరవడి తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందనేది అసత్య ప్రచారమని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల సుఖసంతోషాలనే తాను కోరుకుంటున్నానని, తనకు ఏ పదవులూ అవసరం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
