కాశ్మీర్‌లో భారీ పేలుడు: 12 మంది దుర్మరణం

శ్రీనగర్‌: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా పట్టణంలో సోమవారం జరిగిన భారీ పేలుడులో 12 మంది మరణించారు. ఇందులో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు.

పుల్వామాలోని మార్కెట్‌ స్థలంలో ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో మిలిటెంట్లు శక్తివంతమైన ఐ ఇడిలను పేల్చింది. భద్రతా వాహనాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఈ పేలుళ్లకు వారు పాల్పడినట్లు జమ్మూ కాశ్మీర్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ గోపాల్‌ శర్మ చెప్పారు. ఆత్మాహుతి దళం దీనికి పాల్పడి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. ట్రక్కులో పెట్టిన శక్తివంతమైన బాంబులు పేలడంతో ఈ ఘోరం సంభవించింది. ఈ సంఘటనకు ఎవరు కారణమనేది ఇప్పటి వరకు తేలలేదు. పాకిస్తాన్‌ అనుకూల హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+