అత్తామామలపై అల్లుడి దాడి: మామ మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లా చీరాల మండలం బోరువారిపల్లెలో అల్లుడు అత్తామామలపై దాడి చేశాడు. ఈ దాడిలో మామ చనిపోగా, అత్త తీవ్రంగా గాయపడి చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీనివాసరావు అనే వ్యక్తి సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆరబయట పడుకున్న అత్త పోలమ్మ, మామ ముసలయ్యలపై దాడి చేశాడు. ముసలయ్య అక్కడికక్కడే మరణించాడు.
ఆస్తిపాస్తుల కోసమే శ్రీనివాసరావు అత్తమామలను చంపడానికి సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కూతురును ఇచ్చి శ్రీనివాసరావుకు ముసలయ్య, పోలమ్మలు ఎకరం పొలం ఇచ్చారని, మిగతా పొలం కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేదంటే చంపేస్తానని ఊరిలో కత్తి పట్టుకుని శ్రీనివాసరావు తిరుగుతుండేవాడని గ్రామస్థులు చెప్పినట్లు పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications
