మహారాష్ట్రలో ఆర్వోసి నేత పోతుల సురేష్ అరెస్టు?
హైదరాబాద్: ఆర్వోసి నేత పోతుల సురేష్‌ను మహారాష్ట్రలో అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతపురం జిల్లాలో ఆయన కార్యకలాపాలు విస్తృతంగా కొనసాగిస్తూ వచ్చాడు. హత్యకు గురైన తెలుగుదేశం నాయకుడు పరిటాల రవికి పోతుల సురేష్ అండదండలుండేవనే ప్రచారం కూడా ఉండేది. తన భర్త పోతుల సురేష్‌ను మహారాష్ట్రలో పోలీసులు అరెస్టు చేశారని ఆయన భార్య సునీత ఒక ప్రైవేట్ టీవీ చానల్ ప్రతనిధితో చెప్పారు.
తాము మహారాష్ట్రలో అద్దెకు ఉంటున్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని తనకు శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ వచ్చిందని, పోలీసులు తన భర్తను అరెస్టు చేసి వుంటారని ఆమె అన్నారు. సురేష్‌ను వెంటనే కోర్టులో హాజరుపరచాలని ఆమె డిమాండ్ చేశారు. తన భర్త సురేష్‌తో పాటు ఆ ఇంటిలో ఆయన సోదరుడు శేషయ్య వున్నాడని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications
