శ్యాంకుమార్‌ను దాచిపెట్టారు: నటి కళ్యాణి
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి కలిసి నాలుగు నెలలు కాపురం చేసి తనను మోసం చేయడానికి గేయ రచయిత దాసర్ల శ్యాంకుమార్ ప్రయత్నిస్తున్నాడని సినీనటి కళ్యాణి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులకు చెప్పింది. ఈ నెల పదవ తేదీన తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పింది.
విజయనగం జిల్లాకు చెందిన కళ్యాణి వరంగల్ జిల్లాకు చెందిన దాసర్ల శ్యాంకుమార్ ప్రేమించుకున్నారు. గత నాలుగు నెలలుగా కలిసి వుంటున్నారు. పెళ్లి చేసుకుందామని తాను పట్టుబడుతూ ఉంటే శ్యాంకుమార్ కనిపించకుండా పోయాడని కళ్యాణి చెప్పింది. శ్యాంకుమార్‌కు రెండో పెళ్లి చేయడానికే ఆయన కుటుంబసభ్యులు దాచి పెట్టారని ఆమె ఆరోపిస్తోంది. శ్యాంకుమార్ తన వద్దకు వస్తే ఎంతో ఆనందిస్తానని ఆమె విలపిస్తూ చెబుతోంది.












Click it and Unblock the Notifications
