నక్సల్స్ దాడి: ఎస్‌ఐ మృతి, కానిస్టేబుల్‌కు గాయాలు
ముంబాయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బెల్గాంలో నక్సలైట్లకు, పోలీసులకు మధ్య శుక్రవారం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ (యస్ ఐ) గాగా మరణించాడు. కానిస్టేబుల్ జాదవ్ గాయపడ్డాడు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రిలో చేర్చారు. నక్సలైట్లు బెల్గాంలోని పోలీసు అవుట్‌పోస్టుపై దాడి చేశారు. ఈ సందర్భంగా ఇరుపక్షాలకు ఎదురుకాల్పులు జరిగాయి. నక్సల్స్ దాడి చేసినప్పుడు అవుట్‌పోస్టులో 20 మంది ఉన్నారు. పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య దాదాపు అరగంట సేపు ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ నుంచి నక్సలైట్లు తప్పించుకుని పారిపోయారు.
నక్సల్స్ అణచివేతకు చేపట్టాల్సిన చర్యలపై, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు హైదరాబాద్‌లో 13 రాష్ట్రాల డిజిపిలు, హోం కార్యదర్శులు, ఇంటలిజెన్స్ అధికారులు సమావేశమైన తరుణంలో ఈ దాడి జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications
