తెరాస నేతలను చంపడం సరికాదు: బాలగోపాల్
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకుల పట్ల నక్సలైట్లు వ్యవహరిస్తున్న తీరు సరి కాదని మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి బాలగోపాల్ అన్నారు. టి ఆర్‌యస్ నాయకులను బెదిరించడం, హత్య చేయడం సరికాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాజీనామాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలను నక్సలైట్లు డిమాండ్ చేయవచ్చునని, అయితే వారిని చంపడం సరైంది కాదని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో మావోయిస్టులు ఎంపిటిసి నాగభూషణాన్ని చంపడం దుర్మార్గమని ఆయన అన్నారు. హెచ్చరికలు చేయడం, చంపడం మానుకోవాలని ఆయన నక్సలైట్లకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications
