చర్చలతోనే నక్సల్స్ సమస్య పరిష్కారం: ఎమ్మెస్
కరీంనగర్: నక్సలైట్ సమస్య సంప్రదింపుల ద్వారానే పరిష్కారమవుతుందని క్రీడల, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. నక్సలైట్ సమస్యను శాంతిభద్రతల సమస్యగానే చూస్తున్నారని, దాన్ని సామాజిక, ఆర్థిక సమస్యగా పరిగణించాలని ఆయన అన్నారు. ఆయన సోమవారంనాడు నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్న కరీంనగర్ జిల్లాలోని గంభీరావుపేట మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తాను క్రీడల శాఖ తీరు పట్ల సంతోషంగా లేనని, అందువల్ల తనకు సన్మానాలు వద్దని ఆయన చెప్పారు. నక్సలైట్లను పోలీసుల ద్వారా అణచివేయలేరని తాను మొదటి నుంచీ చెబుతూనే ఉన్నానని ఆయన చెప్పారు. దేవాలయ భూముల విక్రయాల వ్యవహారంపై మాట్లాడటానికి ఆయన నిరాకరించారు.












Click it and Unblock the Notifications
