నక్సల్స్ పద్ధతి మంచిది కాదు: టిఆర్‌యస్
హైదరాబాద్: తమకు నక్సలైట్లు అల్టిమేటం జారీ చేయడం సరి కాదని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు మందాడి సత్యనారాయణ రెడ్డి అన్నారు. తమ నాయకులను, కార్యకర్తలను నక్సలైట్లు చంపడం పద్ధతి కాదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ పద్ధతిలో పోరాడుతున్నామని, అనివార్య కారణాల వల్ల అనుకున్న సమయానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని ఆయన అన్నారు. తాము పార్లమెంటరీ పద్ధతిలో తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు.
గత 35 ఏళ్లుగా నక్సలైట్లు పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటంలో వారూ బలయ్యారు ఇతరులను బలి చేశారని, అయినా తాము అనుకున్న శ్రామిక రాజ్యం తేలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
