నక్సల్స్ బెదిరింపులకు లొంగేది లేదు: వైయస్
సిద్ధిపేట: నక్సల్స్ బెదిరింపులకు లొంగేది లేదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి అన్నారు. నక్సల్స్‌ను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నక్సల్స్ సాధించిందేమీ లేదని ఆయన అన్నారు. సిద్ధిపేటలో ఆయన సోమవారంనాడు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సిద్ధిపేటలో నీటి ఎద్దడి నివారణకు తగిన నిధులు అందిస్తామని ఆయన అన్నారు.
మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పత్తి మార్కెట్ యార్డును ఆయన ప్రారంభించారు. ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. కోటీ 20 లక్షల వ్యయంతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకులకు ఆయన శ్రీకారం చుట్టారు. సిద్ధిపేట శివారులో తలపెట్టిన గృహకల్ప పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. రాజశేఖర్ రెడ్డి పర్యటన సందర్భంగా సిద్ధిపేటలో మహిళా కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్.యఫ్. ఐ. ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు. పోలీసులు లాఠీ చేసి విద్యార్థులను చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications
