బస్సు లోయలో పడి 18 మంది దుర్మరణం

ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక ప్రైవేట్‌ బస్సు లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న 18 దుర్మరణం పాలయ్యారు; 20 మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగింది. గుజరాత్‌లోని వడదొరలో బియస్‌యన్‌యల్‌ ఉద్యోగులను ఎక్కించుకుని మనాలి వెళ్తున్న బస్సు చారంఖుడ్‌లో పడిపోయినుట్లు పోలీసులు చెప్పారు. ఈ బస్సులో ఎంత మంది ప్రయాణిస్తున్నారనేది కచ్చితంగా తెలియదు.

ఇప్పటి వరకు 18 శవాలను వెలికితీశారు. గాయపడినవారిని దగ్గరలోని జోనల్‌ ఆస్పత్రిలో చేర్చారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మలుపులో బస్సును నియంత్రించడంలో డ్రైవర్‌ విఫలం కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగి వుంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+