ఆయుధాలు వీడితే నక్సల్స్‌తో పని చేస్తా: ఎమ్మెస్
కరీంనగర్: ఆయుధాలు వీడితే నక్సలైట్లతో కలిసి తాను పని చేస్తానని క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద ఉన్న డబ్బును వెలికి తీస్తే ప్రపంచ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆయన మంగళవారంనాడు పోలీసు క్వార్టర్స్‌ను ప్రారంభించారు. గ్రామాల్లో భూస్వాములు లేరని,న వారు గతంలోని పోరాటాల వల్ల ఎప్పుడో వెళ్లిపోయారని ఆయన అన్నారు. గ్రామాల్లో భూములు లేవు, సాగునీరు లేదని ఆయన అన్నారు. తుపాకితో ఏమీ సాధించలేమని ఆయన అన్నారు. నక్సల్స్ ఆయుధాలు వీడితే తాను తన మంత్రిపదవికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వారితో కలిసి పని చేస్తానని ఆయన చెప్పారు.
అంతకు ముందు ఆయన కరీంనగర్‌లో క్రీడాజ్యోతితో అర కిలోమీటర్ పరుగెత్తారు. ఒలింపిక్ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి మైదానం బయటకు పరుగెత్తడం ప్రారంభించారు. మంత్రి ఏం చేస్తున్నారో తెలియక మొదట అయోమయంలో పడిన అధికారులు వెంటనే తేరుకుని మంత్రితో పాటు పరుగు తీశారు. అర కిలోమీటర్ పరిగెత్తి ఆయన తన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించుకున్నారు.












Click it and Unblock the Notifications
