టిడిపి అవకాశవాద పార్టీ, పొత్తు ఉండదు: కారత్
తిరుపతి: కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి ఒకసారి, శుక్రవారం ఉదయం మరో సారి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమలలోని అభిషేకోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. శంకరరామన్ హత్య కేసులో బెయిల్ లభించిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని జయేంద్ర సరస్వతి దర్శించుకోవడం ఇదే మొదటి సారి.
శతాబ్దాల సంప్రదాయం ప్రకారం జయేంద్ర సరస్వతికి తిరుమలలో స్వాగతం లభించింది. కంచి స్వామి నిరుడు అక్టోబర్ 1వ తేదీన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. విజయేంద్ర సరస్వతితో కలిసి ఆయన స్వామివారికి కోటిన్నర రూపాయల విలువ చేసే వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ప్రదానం చేశారు.
అయితే తిరుమలలో కంచి స్వామి మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి నిరాకరించారు. మీడియా ప్రతినిధులు కంచి స్వామిని నుంచి ఆశీస్సులు పొంది ఫొటోలు తీసుకోవచ్చునని కంచి మఠం శాఖ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications
