రెండు, మూడు రోజుల్లో కెసిఆర్‌తో భేటీ: దిగ్విజయ్
న్యూఢిల్లీ: రెండు, మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నేత, కేంద్ర మంత్రి కె. చంద్రశేఖర్ రావుతో సమావేశం కానున్నట్లు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి చెప్పారు. పదవులను వదులుకోవాలని టి ఆర్‌యస్ నేతలపై మావోయిస్టుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కెసిఆర్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకుని విజ్ఞప్తి చేశారు.
రేపు శనివారంనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) కార్యనిర్వాహక వర్గాన్ని ఖరారు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కార్యనిర్వాహక వర్గంలో శాసనసభ్యులకు, పార్లమెంటు సభ్యులకు చోటు ఉండదని ఆయన స్పష్టం చేశారు. పిసిసి కార్యనిర్వాహక వర్గం జంబోజెట్‌గా ఉండదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
