చర్చలకు ఆర్టీసి కార్మిక నేతలకు పిలుపు
బిజెపి ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను సరిగా నిర్వర్తించడం లేదని, ఆ బాధ్యతను కూడా తామే నిర్వహించాల్సి వస్తోందని ప్రకాశ్ కారత్ అన్నారు. బిజెపి విశ్వహిందూ పరిషత్‌లో భాగమేననే విషయం బహిరంగమైందని ఆయన అన్నారు. తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకు యుపియేతర పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలకు కార్యవర్గ సమావేశంలో రూపకల్పన చేస్తామని రాఘవులు చెప్పారు. ఆర్టీసి కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత వైఖరిపై సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు. రేషన్‌కార్డుల పంపిణీ, పేదల ఇళ్ల నిర్మాణాల విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా చర్చిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
