రాజేంద్రనగర్‌లో వేర్వేరు చోట్ల రెండు శవాలు
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలో గల రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. అత్తాపూర్‌లోని సాయినగర్ కాలనీలోని ఒక ఇంటిలో శవం కనిపించింది. గోవింద్ షా అనే వ్యక్తి ఈ ఇంటిని శ్రీనివాస్ అనే మరో వ్యక్తికి అమ్మాడు. ఆరు నెలల క్రితం గోవింద్ షా ఎక్కడికో వెళ్లిపోయాడు. తనకు కొన్న ఇంటిని గోవింద్ షా తనకు అప్పగించకపోవడంతో చాలా కాలం నిరీక్షించిన శ్రీనివాస్ ఇటీవల ఆ ఇంటి మరమ్మతులకు పూనుకున్నాడు. సెప్టిక్ ట్యాంక్ మరమ్మతు చేస్తుండగా అందులో ఒక శవం కనిపించింది. దీంతో అతను పోలీసులకు తెలియజేశాడు. ఆ శవం పూర్తిగా గుర్తు పట్టరానంతగా చితికిపోయిందని రాజేంద్రనగర్ ఎసిపి అంటున్నారు.
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోనే మరో చోట ఒక యువకుడి శవం కనిపించింది. అతని శరీరంలోని కిడ్నీ ప్రాంతంలో కత్తిగాటు కనిపించిందని, ఎక్కడో హత్య చేసి శవాన్ని ఇక్కడ పడేసి ఉంటారని ఎసిపి అంటున్నారు. ఈ యువకుడు కర్ణాటక ప్రాంతానికి చెందినవాడై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications