మెదక్ జిల్లా ప్రమాదంలో 14 మంది దుర్మరణం
సంగారెడ్డి: మెదక్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. వీరంతా కర్ణాటకకు చెందినవారని సమాచారం. దైవదర్శనం జీపులో వెళ్తుండగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ వద్ద ఈ విషాద సంఘటన జరిగింది. జీపును ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వెనక గల ఒక కాలనీలో ఉండే వారు 15 మంది జీపులో నిజామాబాద్ జిల్లాలోని పెద్దగట్టు జాతరకు బయలుదేరారు. వీరంతా పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ వచ్చినవారు. దాదాపు సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న జీపును లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 14 మంది మరణించగా 4గురు గాయపడ్డారు. గాయపడినవారిని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. మృతులు ఐదు కుటుంబాలకు చెందినవారు.
మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. జీపు డ్రైవర్ అమృతరావు, యజమాని దేవదాసు కూడా ప్రమాదంలో మృతి చెందారు.












Click it and Unblock the Notifications
