సైకిల్ ర్యాలీతో బాబు మున్సిపల్ ప్రచారభేరీ
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా హైదరాబాద్ సమీపంలోని కూకట్‌పల్లిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సైకిల్ ర్యాలీని ర్యాలీ ప్రారంభించారు. కూకట్‌పల్లిలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. మూడు కిలోమీటర్ల దూరం ఆయన సైకిల్ తొక్కారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తద్వారా ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మట్టి కరిపిస్తారని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వల్ల అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయని, ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
