నక్సల్స్ ప్రభావం తగ్గుతోంది: డిజిపి
విశాఖపట్నం: రాష్ట్రంలో తీవ్రవాదం పెరగడం లేదని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్‌జిత్ సేన్ అన్నారు. రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావం తగ్గుతోందని, అదే స్థాయిలో లొంగుబాట్లు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. నక్సలైట్ల అణచివేతకు పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. హోంగార్డుల రాష్ట్ర స్థాయి సదస్సును ఆయన సోమవారం ఇక్కడ ప్రారంభించారు.
హోంగార్డులకు పలు రాయితీలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అదనంగా మరో మూడు వేల మంది హోంగార్డుల నియామకం జరుపనున్నట్లు ఆయన చెప్పారు. హోంగార్డులకు, ఫైర్ సర్వీసెస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
