వరంగల్‌లో నక్సల్ హతం: నల్లగొండలో మాజీ హత్య
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్ ఒక నక్సలైట్ హతంగా కాగా, నల్లగొండ జిల్లాలో ఒక మాజీ నక్సలైట్ మావోయిస్టుల చేతుల్లో మరణించాడు. వరంగల్ జిల్లా సంగంపల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిపియుయస్‌ఐ ఏటూరునాగారం దళ సభ్యుడు సంపత్ మరణించాడు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా వుంటే, నల్లగొండ జిల్లా చెన్నంపేట మండలం కంబాలపల్లె గ్రామంలో నేతకొండాల్ అనే మాజీ నక్సలైట్‌ను ఇన్‌ఫార్మర్ అనే పేరుతో కాల్చి చంపారు. తంగలపల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు మహబూబ్‌నగర్ జిల్లా తుమ్మగుట్ట గ్రామం వద్ద ఒక ప్రొక్లెయిన్‌ను, లారీని దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications
