ఆర్టీసి కార్మిక నేతలతో ప్రభుత్వ చర్చలు
హైదరాబాద్: రవాణా శాఖా మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి నేతృత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ( ఎపియస్ ఆర్టీసి) నాయకులతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. భోజన విరామ సమయానికి ముందు ప్రారంభమైన చర్చలు ఆ తర్వాత తిరిగి కొనసాగాయి. చర్చల నుంచి కొన్ని ఆర్టీసి కార్మిక సంఘాలకు చెందిన ఆర్టీసి సంరక్షణ సమితి బహిష్కరించింది. ఆర్టీసి కార్మికులు వచ్చే నెల 4వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తామని నోటీసు ఇచ్చారు.
మధ్యాహ్నం వరకు చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని రవాణా శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి చెప్పారు. రేపటిలోగా సమస్య పరిష్కారం కాగలవని ఆయన ఆశించారు. మధ్యాహ్నం వరకు ఐదు అంశాలపై చర్చలు జరిగాయని సంతోష్ రెడ్డితో పాటు కార్మిక సంఘాల నాయకులు చెప్పారు. సమస్యలపై ఉపసంఘం నిర్ణయం వెలువడిన తర్వాత గానీ సమస్య పరిస్కారమైనట్లు కాదని కార్మిక సంఘాల నాయకులన్నారు.












Click it and Unblock the Notifications
