నిజామాబాద్ ఆస్పత్రిలో అండర్ ట్రయల్ మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో సాయిలు అనే అండర్ ట్రయల్ మరణించాడు. అనారోగ్యం కారణంగా సాయిలు మరణించినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఉపాధి ఏదీ దొరక్క సాయిలు దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దొంగ తనాల కేసులో సాయిలు బోధన్ సబ్ జైలులో అండర్ ట్రయల్‌గా ఉన్నాడు. అతని అనారోగ్యం దెబ్బ తినడంతో మొదట అతన్ని ఏరియా ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. మెదడులో రక్తప్రసరణ ఆగిపోయి సాయిలు మరణించినట్లు చెబుతున్నారు. అయితే ఈ వాదనను సాయిలు కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. సాయిలుకు ఏ విధమైన అనారోగ్యం లేదని సాయిలు తల్లి అంటోంది.












Click it and Unblock the Notifications
