వరంగల్‌లో బాంబుపేలుడు: ఒకరి మృతి
వరంగల్:వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో బాంబుపేలడంతో ఒకరు మరణించారు. తొమ్మిదిమంది గాయపడ్డారు. ఈ సంఘటన శనివారంఉదయం జరిగింది. ప్రతి శనివారం ఖైదీలను ఈఆస్పత్రి అవుట్‌పేషెంట్ వార్డుకు పోలీసులు తీసుకురావడంఆనవాయితీ. ఈరోజు కూడా ఖైదీలను తీసుకొచ్చి లైన్లలో నిలిపిపోలీసుసిబ్బంది ఆక్కడ నిలబడి ఉండగా బాంబు పేలింది. ఈపేలుడులో ఒక సాధారణ పౌరుడుమరణించగా ముగ్గురు పోలీసుసిబ్బంది గాయపడ్డారు. మరో ఆరుగురుసాధారణ పౌరులకు కూడాగాయాలయ్యాయి. ఇది న క్సలైట్ల చర్యలాఉందని వరంగల్ రేంజి డిఐజి మీనా చెప్పారు. నిన్నజనశక్తి అగ్రనేత రియాజ్ కాల్చివేతకు ప్రతీకారంగా ఈచర్య జరిగినట్టు ఇంకా నిర్ధారణ కాలేదనిఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
