ఎన్నారై భర్తలపై కోల్‌కతా హైకోర్టులో పిల్
కోల్‌కత: విదేశాల్లోఉంటున్న భారతీయ వ్యక్తులు తమ భార్యలకువిడాకులు ఇవ్వకుండా చూడాలంటూకోలకతా హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలైంది. ప్రవాస భారతీయభర్తలు నిస్సహాయులైన తమ భార్యలకువిడాకులు ఇవ్వడానికి విదేశీ కోర్టులనుఆశ్రయిస్తున్నారని, ఆ కోర్టులోతమ వాదన విన్పించడానికి తగినఆర్ధిక స్ధోమతు ఎన్నారై భార్యలకుఉండడం లేదని కోల్‌కతాకు చెందినరిలేషన్స్ అనే మ్యారేజ్ బ్యూరో పిటిషన్‌దాఖలు చేసింది. భారతదేశంలోని ప్రధాననగరాలకు చెందిన ఎన్నారైయువతుల్లో పది శాతం తమ భర్తలనుంచి విడాకుల నోటీసులుపొందుతున్నారని ఆ సంస్ధ పిటిషన్‌లోపేర్కొంది. ప్రవాస భారతీయ యువకులువిదేశాల్లో దాఖలు చేస్తున్న విడాకులపిటిషన్లు ఎక్కువగా పాసవుతున్నాయని,దానికి కారణంకోర్టు కేసుల్లో తమ వాదనవిన్పించడానికి కావల్సిన డబ్బు భార్యలవద్ద లేకపోవడమేనని ఆ సంస్ధ వాదించింది. అటువంటిభార్యలు భారతదేశంలో కోర్టులనుఆశ్రయిస్తున్నారని, ఆ కోర్టు తీర్పులనుఎన్నారై భర్తలు పట్టించుకోవడంలేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications
