నెలాఖరు లోగా వైదొలుగుతాం: నరేంద్ర
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులోగా తాము ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) అగ్రనేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిది ఫాసిస్టు ప్రభుత్వమని ఆయన అన్నారు. తమకు ఎవరూ పొగ పెట్టలేదని, తమంత తామే ప్రభుత్వం నుంచి వైదొలుగాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.
జనశక్తి నాయకుడు రియాజ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కాంగ్రెస్‌కు, తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. వైయస్ ప్రభుత్వ చర్యను శనివారంనాడు టి ఆర్‌యస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు తీవ్రంగా తప్పు పట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైయస్ అనుసరిస్తున్న వైఖరిపై కూడా టి ఆర్‌యస్ కక్కలేక మింగలేక అన్న స్థితిలో పడిపోయింది.












Click it and Unblock the Notifications
