ఆర్టీసి చర్చలు విఫలం: రేపటి నుంచి సమ్మె
హైదరాబాద్: రేపటి నుంచి ఆర్టీసి కార్మికుల సమ్మె అనివార్యమైంది. ప్రభుత్వం ఆర్టీసి సంఘాలతో ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపటి నుంచి సమ్మెమ ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి. సోమవారం తెల్లవారు జామున మూడు గంటల నుంచి సమ్మె మొదలవుతుందని ఆర్టీసి సంఘాలు ప్రకటించాయి. ఈ నెల 4వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఆర్టీసి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నోటీసు ఇచ్చింది. మొత్తం 18 డిమాండ్లను సమితి ఆర్టీసి యాజమాన్యం ముందు, ప్రభుత్వం ముందు ఉంచింది. ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లు పరిష్కారం కాకపోవడంతో సమ్మెకు దిగుతోంది.












Click it and Unblock the Notifications
