ఆలంపూర్‌లో పాతకక్షలకు ముగ్గురు బలి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ చౌరస్తా వద్ద పాతకక్షలకు ముగ్గురు బలయ్యారు. బాంబులతో దాడి చేసి కత్తులతో నరికి ముగ్గురిని ప్రత్యక్షర్థులు మంగళవారంనాడు హత్య చేశారు. భగ్వాన్‌గౌడ్, ఆయన కుమారుడు రమేష్, జకీర్ ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి వలీ తీవ్రంగా గాయపడి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
భగ్వాన్ గౌడ్‌ను చంపడానికి ప్రత్యర్థులు సోమవారం నుంచి ఆయన ఇంటి వద్ద మాటు వేసి ఉన్నారు. అయితే భగ్వాన్ గౌడ్ కర్నూలు వెళ్లి తీరిగి వస్తున్నాడని తెలుసుకుని ప్రధాన రహదారిపై మాటు వేశారు. భగ్వాన్‌గౌడ్ కారును కనిపెట్టి ప్రత్యర్థులు బాంబులు విసిరారు. కారులో ఉన్న నలుగురిని ఆ తర్వాత కత్తులతో నరికారు. ఈ దాడిలో భగ్వాన్ గౌడ్, జకీర్ అక్కడికక్కడే మరణించారు. రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కారు డ్రైవర్ వలీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
నిరుడు వెంకన్న గౌడ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు భగ్వాన్ గౌడ్ కారణమని వెంకన్న వర్గీయులు భావించారు. అప్పటి నుంచి భగ్వాన్ గౌడ్ మట్టుపెట్టేందుకు సమయం కోసం వేచి ఉన్నారు. చివరకు మంగళవారం వారి పాతకక్షలకు ముగ్గురిని బలి చేశారు. తమపై దేవన్న వర్గీయులు దాడి చేశారని వలీ చెబుతున్నాడు.












Click it and Unblock the Notifications
