రవి హత్య కేసు: నిందితుల రిమాండ్ పొడిగింపు
అనంతపురం: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో 11మంది నిందితుల జ్యుడిష్యల్ రిమాండ్‌ను జిల్లా కోర్టు ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించింది. భద్రతా కారణాల రీత్యా మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరిని కోర్టులో హాజరు పర్చలేకపోయినట్లు జైలు అధికారులు కోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. సూరిని వేరే ప్రాంతంలోని జైలుకు మార్చాలనే వాదనను సూరి తరఫు న్యాయవాది ఆదిశేషా రెడ్డి వ్యతిరేకిస్తున్నారు.
సూరిపై అనంతపురం, ధర్మవరం కోర్టులో ఏడు కేసుల్లో విచారణ సాగుతోందని, ఈ పరిస్థితిలో వీడియో లింకేజ్ ద్వారా విచారణ జరపడం సాధ్యం కాదని ఆయన అన్నారు. వాయిదాలకు మాత్రమే వీడియో లింకేజ్ సరిపోతుందని ఆయన అన్నారు. పప్పు యాదవ్ కేసుకు సూరి కేసులకు మధ్య పొంతన లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
