టిడిపి నివేదనపై టిఆర్‌యస్ మండిపాటు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తన వాదనను వినిపించడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) నాయకుడు విజయరామారావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు అంశంపై తాము, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ప్రజలు తెలుగుదేశం పార్టీని ఓడించారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమను, కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పుడు తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ 8,500 మంది తమ పార్టీ ప్రతినిధులు తీర్మానం చేశారని తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలియజేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. వారంతా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలని, తాము లక్షలాది మంది సమక్షంలో వేర్పాటువాదానికి అనుకూలంగా తీర్మానం చేశామని, ప్రజలు స్పష్టంగా తమ తీర్మానాన్ని ఆమోదించారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ విధానాల వల్లనే తెలంగాణ వెనుకబడిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
