For Daily Alerts
బాబు వైఖరిపై తెలంగాణలో నిరసన ప్రదర్శనలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) గురువారంనాడు తీవ్రంగా ప్రతిస్పందిస్తారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా చంద్రబాబు తన వైఖరి మార్చుకోకపోవడాన్ని టి ఆర్‌యస్ తీవ్రంగా తప్పు పట్టింది.
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తాలో టి ఆర్‌యస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి, చంద్రబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. కరీంనగర్ జిల్లా అంతటా తెలుగుదేశం వైఖరిపై నిరసన వ్యక్తమైంది. జిల్లాలో పలు చోట్ల టి ఆర్‌యస్ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. గోదావరిఖని, రామగుండం, కరీంనగర్‌లలో చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాస్తారోకో నిర్వహించారు. నల్లగొండ జిల్లా ఆలేరులో టి ఆర్‌యస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని ఆలేరులో, మిర్యాలగూడాలో , వరంగల్ జిల్లాలోని పరకాలలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లాలోనూ ప్రదర్శన నిర్వహించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!