సాగర్ ఆయకట్టుకు ఇప్పుడు నీరు కష్టం: పొన్నాల
తిరుపతి: నాగార్జున సాగర్ ఆయకట్టుకు ప్రస్తుతం నీరు విడుదల చేసే పరిస్థితి లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ కుడి కాలువ కింది భూములకు గానీ ఎడమ కాలువ కింది భూములకు గానీ ఇప్పుడు నీరు విడుదల చేయడం సాధ్యం కాదని ఆయన విలేకరులతో చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు విడుదల చేసే ఆలోచన చేస్తామని ఆయన అన్నారు. ఈలోగా నాగార్జున సాగర్‌కు నీరు చేరితే విడుదల చేస్తామని ఆయన చెప్పారు. మొదట కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయడం గత రెండు దశాబ్దాలుగా ఒక సంప్రదాయంగా వస్తోందని, అదే పద్దతిని ఇప్పుడు అనుసరిస్తామని ఆయన చెప్పారు.
కర్ణాటకలోని నారాయణపూర్ రిజర్వాయర్‌లోకి పెద్ద యెత్తున వరద నీరు వచ్చి చేరుతోందని, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రేపు సాయంత్రానికి నీరు చేరే అవకాశం ఉందని ఆయన చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు చేరడానికి మరో మూడు రోజులు పట్టవచ్చునని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
