పులిచింతలపై రెండు వారాల్లో వివరణ: హైకోర్టు
హైదరాబాద్: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పర్యావరణ శాఖకు, కేంద్ర జలసంఘానికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. పులిచింతల ప్రాజెక్టు నిలిపేయాలని కోరుతూ రిటైర్డ్ ఇంజనీర్ వెంకటరెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారణ ముగిసేవరకు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టకూడదని ఆదేశాలు ఇవ్వాల్సిందిగా వెంకటరెడ్డి చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
పులిచింతల ప్రాజెక్టు ఏ ప్రాంతానికి కూడా పనికి రాదని, సాగునీటి అవసరాలు తీర్చడానికి ఇప్పటికే నాగార్జునసాగర్ ఉందని, అందువల్ల పులిచింతల నిర్మాణం అవసరం లేదని వెంకటరెడ్డి వాదిస్తున్నారు. ప్రయోజనం లేని పులిచింతల నిర్మాణం చేపట్టి ప్రజల మీద భారం మోపడం సరైంది కాదని ఆయన అంటున్నారు. మూర్ఖంగా పులిచింతల నిర్మాణాన్ని చేపట్టారు కాబట్టే తాను పిటిషన్ వేయాల్సి వచ్చిందని ఆయన చెబుతున్నారు. కండీషనల్ అనుమతి తెచ్చి పులిచింతల నిర్మాణాన్ని మొదలు పెట్టారని, రాజకీయ నాయకులు ఈ ప్రాజెక్టును ఆపలేరు కాబట్టి తాను పిటిషన్ వేశానని ఆయన అంటున్నారు.












Click it and Unblock the Notifications
