వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రజా సమస్యలపై రాజీ లేని పోరు: చంద్రబాబు
హైదరాబాద్: ప్రజాసమస్యలపై తాము రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తాము పోరాడుతామని ఆయన అన్నారు. తెలుగుదేశంపార్టీ కార్యాలయం ఎన్టీ ఆర్ ట్రస్టు భవన్‌లో సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తల రక్తదాన శిబిరం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాజకీయాలకు కొత్త అర్థం చెప్పాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. సేవాభావంతో రాజకీయాల్లో తాము పని చేస్తామని ఆయన చెప్పారు. ప్రజాసమస్యల సాధనకు పోరాటం చేస్తూనే జనాభా నియంత్రణ, ఎయిడ్స్ నియంత్రణ వంటి వాటి కోసం సేవాభావంతో తమ కార్యకర్తలు పనిచేస్తారని ఆయన చెప్పారు. ప్రపంచంలోని దేశాలను, ప్రభుత్వేతర సంస్థలను ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాల్లో తాము పాల్గొంటామని ఆయన చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!